ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేటితో రిమాండ్ ముగియడంతో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.. మరోవైపు.. ఈ నెల 13వ తేదీతో వల్లభవేని వంశీ మోహన్ రిమాండ్ 90 రోజులు పూర్తి అవుతుందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వంశీ ఆ తర్వాత ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు
May 06, 2025
0
Tags