తెలంగాణలో 3,989 మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇక నుంచి అంగన్‌వాడీ టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్‌వాడీ అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్‌వాడీ టీచర్లేనని స్పష్టం చేసింది. ఈ నెల నుంచి అమల్లోకి ఉత్తర్వులు రానున్నాయి. ఏప్రిల్ నుంచి మినీ అంగన్‌వాడీ టీచర్లకూ నెలకు రూ.13,650 ఇవ్వనుంది. గతంలో మినీ అంగన్‌వాడీ టీచర్లకు జీతం రూ. 7800ను ఇచ్చింది. ఈ మేరకు మంత్రి సీతక్కకు మినీ అంగన్వాడీ టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో మినీ అంగన్‌వాడీ టీచర్లకు మెయిన్ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రమోషన్ !
May 06, 2025
0
Tags