తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హెలికాప్టర్‌లో కుటుంబ సమేతంగా సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరానికి చేరుకున్నారు. ఆయనకు మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు స్వాగతం పలికారు. త్రివేణి సంగమం వద్ద గవర్నర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సరస్వతి పుష్కరాలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పుష్కరాలు ముగింపు దశకు రావడంతో భారీగా తరలివస్తున్నారు. కాళేశ్వరం నుంచి సిరోంచ బ్రిడ్జి వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
త్రివేణి సంగమం వద్ద పుష్కర స్నానం ఆచరించిన తెలంగాణ గవర్నర్ దంపతులు
May 25, 2025
0
Tags