కర్ణాటకలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుతో దాదాపు 150మందిని నమ్మించి రూ. కోటికి పైగా దోచుకొన్నారు. సైబర్ మోసగాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లు వీడియోలను సృష్టించారు. తాను ట్రంప్ పేరుతో యాప్‌ను రూపొందించానని, పెట్టుబడులు పెట్టాలని తద్వారా అధిక లాభాలు గడించవచ్చని అమెరికా అధ్యక్షుడు సూచిస్తున్నట్లు ఉన్న పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో కర్ణాటకలోని తుమకూరు, బెంగళూరు, హవేరి ప్రాంతాలలోని దాదాపు 150మంది ఆ వీడియోలను నమ్మి అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి, యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. వారికి యూఎస్ ప్రభుత్వానివే అని నమ్మించేలా ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. కొద్ది నెలల పాటు వారు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లు చూపిస్తూ.. డబ్బు, ఇతర బహుమతులు అందించారు. కొద్ది రోజులకు యాప్ నిర్వహకులు తమ కాల్స్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సైబర్ మోసగాళ్ల వలలో పడి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150మంది కోటి రూపాయలకు పైగా విలువైన డబ్బు పోగొట్టుకున్నట్లు గుర్తించామని సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఏఐను ఉపయోగించి ట్రంప్ పేరుతో 150 మందిని మోసగించిన కేటుగాళ్లు !
May 25, 2025
0
Tags