కరుంగ్ ఓన్లర్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు మేరీ కోమ్ అధికారికంగా ప్రకటన

Telugu Lo Computer
0


తన భర్త కరుంగ్ ఓన్లర్ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు  మేరీ కోమ్ అధికారికంగా ప్రకటించారు. వారిద్దరూ 2005 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే మేరీ కోమ్ విడాకుల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. విడాకులకు ముందు మేరీ కోమ్‌కు హితేష్ చౌదరితో సంబంధం ఉందని పుకార్లు వచ్చాయి. హితేష్ చౌదరి ప్రస్తుతం మేరీ కోమ్ ఫౌండేషన్ ఛైర్మన్ గా ఉన్నాడు. ఇప్పుడు మేరీ కోమ్ ఈ విషయాలన్నింటిపై తన మౌనాన్ని వీడి లేఖను పంచుకోవడం ద్వారా స్పందించింది. గత రెండు సంవత్సరాలు వ్యక్తి గత జీవితం చాలా కష్టంగా గడిచిందని మేరీ కోమ్ అన్నారు. మేరీ కోమ్‌ బాక్సింగ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అయిన హితేష్‌తో తనది వ్యాపార సంబంధమేనని స్పష్టంజేసింది. కాగామేరీ వ్యక్తిగత జీవితంపై కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె న్యాయ బృందం స్పందించింది. ఈమేరకు సుదీర్ఘమైన ప్రకటన విడుదలజేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా కోమ్‌ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆ ప్రకటనలో కోరారు. కాగా వారిద్దరూ కలిసి దిగిన ఫొటోలను మేరీ, హితేష్‌ తమ సోషల్‌ మీడియా ఖాతా నుంచి తొలగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)