ముంబయి వేదికగా మే 1 నుంచి 4 వరకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్) అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇండియన్ సినిమాల గురించి మాత్రమే కాదు, ఓటీటీలు, కామిక్స్, డిజిటల్ మీడియా, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ ఇలా పరిశ్రమకు సంబంధించి ఎన్నో విషయాలపై చర్చించే వేదికే వేవ్స్. ప్రధాని మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి చర్చించనున్నారు. ఆయనతో పాటు వేవ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యులు హాజరై వారి సలహాలు, సూచనలను అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రముఖులంతా ఇప్పటికే ముంబయి చేరుకున్నారు. సృజనాత్మకతను పెంపొందించడమే లక్ష్యంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 90కి పైగా దేశాల నుంచి 10 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. 1000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్‌లు, ఎంతోమంది సినీ ప్రముఖులు ఒకచోట చేరనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన క్రియేట్ ఇండియా అనే ఛాలెంజ్‌లో గెలుపొందిన వారికి మోడీ అవార్డులు అందించనున్నారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు సినీ ప్రముఖులు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమకు ఆయన ఇస్తోన్న మద్దతుకు కృతజ్ఞతలు చెబుతూ పోస్ట్‌లు పెట్టారు.
నేటి నుంచి వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్
May 01, 2025
0
Tags