తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను 16 ఏళ్లకే డిఫెన్స్‌లోకి వెళ్లానని, 1982లో మిగ్ 21 ఫైటర్ ఫైలట్‌గా పని చేశానని చెప్పారు. ఆ తర్వాత మిగ్ 23 అత్యాధునిక ఫ్లైట్ పైలట్‌గా పని చేశా. శబ్ద వేగానికి 2.5 రేట్లు ఎక్కువ వేగంతో మిగ్ 23 దూసుకెళ్తుంది. చాలా చిన్న వయస్సులో 20 ఏళ్లకే పైటర్ పైలట్ గా పని చేశా. కాశ్మీర్ విషయంలో ఒక కీలక చర్య జరిగితే తప్ప రెండు దేశాల మధ్య సమస్య పరిష్కారం కాదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను ఇండియా పరం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. పాకిస్తాన్ జమ్మూపై చేసిన దాడికి ఇండియన్ ఆర్మీ ప్రతిదాడి చేయడం సరైన చర్య. యుద్ధం కొనసాగితే పాకిస్తాన్ పతనం అవుతుంది. మూడో దేశం ఏదీ కూడా యుద్ధం చేయడానికి ముందుకు రాకపోవచ్చు. మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే నేను వెళ్లడానికి సిద్ధమని చెప్పారు. ఏప్రిల్ 22న పాకిస్థాన్ ప్రేరేపిత చర్య చాలా దుర్మార్గం. మతం పేరు అడిగి చంపారు. ఈ ఘటనపై కశ్మీర్ సహా దేశమంతా ఏకతాటిపైకి వచ్చి ఖండించింది. టీఆర్ఎఫ్ అనేది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ. పాకిస్థాన్ నిర్వాకానికి దీటుగా బుద్ధి చెప్పడం సరైన చర్య. ఆపరేషన్ సిందూర్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు, కామికసేన్ డ్రోన్ లు పనిచేశాయి. భారత్ బోర్డర్ నుంచే రాఫెల్ యుద్ధ విమానాలు పని చేశాయి. రాఫెల్ విమానాలు వాళ్ల ఆర్మీ కూల్చివేసిందని పాక్ చెబుతున్న విషయం అబద్ధం. ఎందుకంటే.. రాఫెల్ బోర్డర్ దాటలేదు. పాక్.. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితిలో ఉంది. పాక్‌లో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. పాక్ సృష్టించిన ఉగ్రవాదులే ఆ దేశానికి ప్రాణ సంకటంగా మారారు. యుద్ధం చేయడం మన ఉద్దేశం కాదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే సైన్యం కొట్టేసింది. పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. పేరుకు ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ పాక్ ఆర్మీ మాత్రమే పాక్‌ను నడిపిస్తుందని చెప్పారు.
మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే నేను వెళ్లడానికి సిద్ధం : ఉత్తమ్‌కుమార్ రెడ్డి
May 09, 2025
0
Tags