ఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

Telugu Lo Computer
0


భారత్‌-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా ఢిల్లీ లోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులకు సాయం చేసేందుకు, సమాచారం ఇచ్చేందుకు, వారికి అవసరమైన సేవలు అందించేందుకు ఈ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సాయం కావాలన్నా కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 011-23380556ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌తో పాటు రెసిడెంట్‌ కమిషనర్ ప్రైవేటు సెక్రటరీ, లైజన్‌ హెడ్‌ నంబర్‌ 98719-99044, రెసిడెంట్‌ కమిషనర్‌ వ్యక్తిగత సహాయకుడి నంబర్‌ 99713-87500, తెలంగాణ భవన్‌లో లైజన్‌ ఆఫీసర్‌ నంబర్‌ 96437-23157, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ నంబర్‌ 99493-51270ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)