హైదరాబాద్‌లో రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో పేలిన ఏసీ కంప్రెసర్‌లు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మధురానగర్‌లో రెసిడెన్షియల్‌ బిల్డింగ్‌లో ఏసీ కంప్రెసర్‌లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన స్థలానికి అగ్నిమాపక దళాలు చేరుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు. నగర వాసులను వరుస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఈ నెలలోనే చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 17మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. షార్ట్స్‌ సర్క్యూట్‌ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు పాతబస్తీలోలోని మహారాజ్‌గంజ్‌లోని స్క్రాప్‌ గోదాం (ప్లాస్టిక్‌ గోడౌన్‌)లో మంటలు ఎగిసిపడి మూడు అంతస్తులకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్నవారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మొదటి అంతస్తులో డిస్పోజబుల్‌ ప్లేట్స్‌ గోడౌన్‌, రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నారు. మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న మరో కుటుంబం. ప్లాస్టిక్‌ సమాన్లు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)