ఉబెర్, రాపిడో వంటి రైడ్-హెయిలింగ్ యాప్‌లలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ 'అడ్వాన్స్ టిప్పింగ్' విధానంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. "వేగవంతమైన పికప్ కోసం టిప్ జోడించండి" అంటూ వినియోగదారులను ప్రోత్సహిస్తున్న ఈ విధానం నైతికంగా సరికాదని, ఇది క్యాబ్‌ల కోసం వేలంపాటను ప్రోత్సహించేలా ఉందని పేర్కొంటూ గతవారం ఉబెర్‌కు సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఉబెర్ వాదన ప్రకారం,ముందుగా టిప్ ఇస్తే డ్రైవర్లు రైడ్‌ను అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుందట. రాపిడో, ఓలా క్యాబ్స్ కూడా ఇదే తరహా విధానాలను అనుసరిస్తూ, త్వరగా రైడ్ దొరకాలంటే అదనంగా చెల్లించాలంటూ వినియోగదారులను బలవంతం చేస్తున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయంపై స్పందిస్తూ ఓలా, రాపిడోలతో సహా పలు రైడ్-హెయిలింగ్ యాప్‌లపై సీసీపీఏ దర్యాప్తు జరుపుతోందని ధృవీకరించారు. ఉబెర్ ఇప్పటికే సీసీపీఏ పరిశీలనలో ఉంది.సేవలు వేగంగా పొందేందుకు వినియోగదారులను ముందుగానే టిప్ చెల్లించమని బలవంతం చేయడం లేదా ప్రోత్సహించడం నైతికంగా తప్పని, దోపిడీతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.టిప్ అనేది ప్రశంసకు గుర్తుగా ఉండాలి కానీ, సేవకు ముందస్తు షరతు కాకూడదని స్పష్టం చేశారు.
'అడ్వాన్స్ టిప్పింగ్' విధానంపై ఉబెర్‌కు సీసీపీఏ నోటీసులు జారీ !
May 30, 2025
0
Tags