లోపాయికారీ ఒప్పందంతోనే బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు : మహేష్ గౌడ్

Telugu Lo Computer
0


బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్, కిషన్ రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజ్ అందిందో బహిర్గతం చేయాలన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు, ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)