ఫుట్ పాత్‌పై గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

Telugu Lo Computer
0


సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంజు థియేటర్ సమీపంలోని జెకె ఫర్నిచర్స్ దుకాణం వద్ద ఫుట్ పాత్‌పై నివసిస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తి గ్రానైట్ రాయితో తలపై బలంగా కొట్టి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న మహంకాళి పోలీసులు హత్య జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. మృతదేహం పక్కనే గ్రానైట్ రాయి లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)