నరకం లేదా పాకిస్తాన్ అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటే, తాను నరకాన్ని ఎంచుకుంటా !

Telugu Lo Computer
0


నకు నరకం లేదా పాకిస్తాన్ అనే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉంటే, తాను నరకాన్ని ఎంచుకుంటానని ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, 'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జావేద్ అఖ్తర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.శనివారం ముంబైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జావేద్ అఖ్తర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు అనేక ప్రశంసలతో పాటు, "రెండు వైపులా ఉన్న తీవ్రవాదుల" నుంచి దూషణలు, విమర్శలు కూడా వస్తుంటాయని ఆయన తెలిపారు. అయితే, ఆ రెండు వైపులా ఎవరున్నారనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేదు."ఏదైనా ఒక పక్షం గురించే మాట్లాడితే, ఆ ఒక్క పక్షానికే కోపం వస్తుంది. కానీ అందరి తరఫున మాట్లాడితే, చాలా మందికి కోపం వస్తుంది. నా ట్విట్టర్, వాట్సాప్ చూపిస్తే అర్థమవుతుంది. రెండు వైపుల నుంచి ఎలాంటి తిట్లు వస్తాయో. చాలా మంది నన్ను అభినందిస్తారు, ప్రశంసిస్తారు, నాలో స్ఫూర్తి నింపుతారు. కానీ, రెండు వైపులా ఉన్న తీవ్రవాదులు నన్ను దూషిస్తారన్నది కూడా నిజం. ఇది ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఒకవైపు నుంచి తిట్టడం ఆపేస్తే, నేనేమైనా తప్పు చేస్తున్నానేమోనని నాకు అనుమానం వస్తుంది" అని ఆయన చమత్కరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)