మిథున్‌ చక్రవర్తికి బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ

Telugu Lo Computer
0


సీనియర్‌ నటుడు మిథన్‌ చక్రవర్తికి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)  షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అనుమతి లేకుండా నిర్మించిన వాటిని తొలగించాలని ఆదేశించింది. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మలాడ్‌లోని తన స్థలంలో మిథున్‌ అనుమతి లేకుండా గ్రౌండ్‌ ఫ్లోర్‌, మూడు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టినట్టు బీఎంసీ నోటీసుల్లో పేర్కొన్నారు. తాను అక్రమంగా నిర్మించలేదని, బీఎంసీకి సమాధానమిస్తామని మిథున్‌ జాతీయ మీడియాకు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)