ఆపరేషన్ సిందూర్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేసిన కేరళకు చెందిన విద్యార్థి కార్యకర్త రెజాజ్ ఎం షీబా సిద్ధిఖ్‌ను మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో భాగంగా అతడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని, నిషిద్ధ డార్క్ వెబ్‌సైట్లలో పలు అకౌంట్లు ఉన్నాయని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అతడు డార్క్‌వెబ్‌లో చురుగ్గా ఉన్నాడని, అందులో దేశవ్యతిరేక పోస్టులను అనుసరిస్తూ వాటికి మద్దతు పలుకుతున్నట్లు గుర్తించామని అన్నారు. రెజాజ్‌కు పాకిస్తాన్‌కు చెందిన పలు ఉగ్ర సంస్థలలో సభ్యత్వం కూడా ఉన్నట్లు తెలిపారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి అతడి వద్ద ఉన్న డిజిటల్ పరికరాలను సైబర్-ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో అతడు చేసిన పోస్టులలో నాగ్‌పూర్‌లోని ఒక రైఫిల్ దుకాణాన్ని సందర్శించి తుపాకీ పట్టుకొని తీసుకున్న ఫొటోలు ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు. అతడికి ఇంకా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే విషయాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేస్తున్నామని అన్నారు.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అదుపులో విద్యార్థి కార్యకర్త రెజాజ్ ఎం షీబా సిద్ధిఖ్
May 20, 2025
0
Tags