అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు సభ్యుడిగా ఉన్న కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. యన పదవీకాలం మరో ఆరు నెలలు మిగిలి ఉండగానే తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. ఐఎంఎఫ్ బోర్డు కీలక సమావేశానికి కొద్ది రోజుల ముందే ఈ చర్య తీసుకుంది. ఆ సమావేశంలో పాకిస్థాన్‌కు కొత్తగా 1.3 బిలియన్ డాలర్లు ఉద్దీపన రుణాన్ని మంజూరు చేయాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకోనుంది. పహల్గామ్ దాడి అనంతరం పాకిస్థాన్ ఆర్ధిక మూలాలను భారత్ దెబ్బకొట్టి, దాయాదిని అష్టదిగ్భంధనం చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం అందకుండా చర్యలు చేపడుతోంది. ఇదే సమయంలో ఐఎంఎఫ్ రుణం కూడా దాయాదికి అందకుండా చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ఫిర్యాదు చేసిన భారత్ త్వరలో జరగబోయే సమావేశంలో రుణం మంజూరు ఆమోదం పొందకుండా ప్రయత్నాలు చేస్తోంది. తనను ఐఎంఎఫ్ బోర్డు సభ్యుడిగా తొలగించడంపై సుబ్రమణియన్ ఇంకా స్పందించలేదు. ప్రధాని మంత్రి మాజీ ఆర్థిక సలహాదారు అయిన కృష్ణమూర్తి సుబ్రమణియన్ ఐఎంెఫ్ డేటాసెట్‌లపై ప్రశ్నలు లేవనెత్తడంతోనే ఆయనను సభ్యుడిగా తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐఎంఎఫ్‌తో ఆయనకు గతంలోనూ కొనసాగిన విబేధాలు కూడా కారణం కావచ్చని తెలుస్తోంది.
ఐఎంఎఫ్ బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తి సుబ్రమణియన్ తొలగింపు
May 04, 2025
0
Tags