'నీట్‌' రాసేందుకు వెళ్తూ ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని జైపూర్‌ జిల్లాలో  వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ (యూజీ) పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు నీట్‌ అభ్యర్థులు ఉండగా, వారితో పాటు ఉన్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు విద్యార్థినులు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై నీట్‌ పరీక్ష రాసేందుకు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ఓ వంతెన వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఖుషి శర్మ (21), ప్రియా శర్మ(22)గా గుర్తించారు. వీరిద్దరూ బస్సీ పట్టణం సమీపంలోని గ్రామానికి చెందినవారని తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రక్కు డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)