చత్తీస్గడ్ లోని సుక్మాలో పలువురు మావోయిస్టు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల బెటాలియన్ వన్‌లో నలుగురు కీలక మావోయిస్టు నేతలతో పాటు మరో 18 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఇద్దరు నక్సలైట్లపై ఒక్కొక్కరికి రూ. 8 లక్షలతో సహా మొత్తం రూ. 39 లక్షల రివార్డు ఉంది. సుక్మా, బీజపూర్ ప్రాంతంలో అనేక విధ్వంసక సంఘటనలలో మావోయిస్టులు పాల్గొన్నారు. కాగా సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్, పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసులు నియాద్ నెల్లా నార్ యోజన కింద పునరావాసం కల్పించనున్నారు. కాగా మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారం మేరకే నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ జరిగిందని అన్నారు. ఆరు నెలలుగా మాడ్ ప్రాంతంలోనే నంబాల ఉన్నట్లు ప్రకటించారు. కేశవరావు టీమ్‌లో ఉన్న ఆరుగురు మావోయిస్టులు ఇటీవలే లొంగిపోయారని మావోయిస్టులు ఆ లేఖలో తెలిపారు. వారిచ్చిన సమాచారంతోనే ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలిస్తామంటే ఆయన ఒప్పుకోలేదని, కేశవరావు కోసం 35 మంది ప్రాణాలు అడ్డుపెడితే ఏడుగురం సురక్షితంగా బయటపడ్డామని అన్నారు. 27 మంది ఎన్ కౌంటర్‌లో చనిపోయారని చెప్పారు. పాకిస్తాన్‌తో చర్చలు జరిపినప్పుడు తమతో చర్చలు జరిపితే తప్పేంటని ప్రశ్నించారు. స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరుతో ఈ లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు
May 27, 2025
0
Tags