జుట్టు, చర్మ సమస్యలు - కొబ్బరి నీళ్లు

Telugu Lo Computer
0


చాలామందికి జుట్టు రాలిపోవడం, చర్మం పొడి వారి పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొబ్బరి నీళ్లు జుట్టుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. సాధారణంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొబ్బరి నూనెను ఉపయోగించడం మనందరికీ తెలిసిందే. అలాగే చర్మం పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను రాసుకుంటూ ఉంటారు. అయితే కొబ్బరి నూనెలోని కాదు. దీని నీటిలో కూడా జుట్టుకు మేలు చేసే పదార్థాలు ఉన్నాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ముఖంపై వృద్ధాప్య ఛాయలు లేదా మొటిమలు వల్ల వచ్చే మచ్చలు ఉంటే కొబ్బరి నీళ్లలో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా ఒక నెలపాటు చేస్తే మచ్చలు పూర్తిగా మాయమవుతాయని నిపుణులు అంటున్నారు. చర్మం లేదా పొడి చర్మం సమస్యలకు కూడా కొబ్బరి నీళ్ళు మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ఏ రకమైన చర్మ సమస్యలు ఉన్నా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్లల్లో దూదిని నానబెట్టి, అప్పుడప్పుడు, దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా తరచూ చేసుకుంటూ వస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. వర్షాకాలంలో చాలామంది జుట్టు రాలడంతో బాధపడుతుంటారు. కొబ్బరి నీళ్లను కొద్దిగా వేడి చేసి తలపై మసాజ్ చేసుకోవాలి. షాంపూ చేసిన తర్వాత కొబ్బరినీళ్ళతో జుట్టును కడిగిన ప్రయోజనం ఉంటుంది. ఇలా చేస్తే జుట్టు మెరిసేలా చేయడమే కాకుండా చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయట. 

Post a Comment

0Comments

Post a Comment (0)