ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమంటూ శేఖర్‌ కమ్ముల ఆసక్తికర పోస్ట్‌

Telugu Lo Computer
0


ర్శకుడు శేఖర్‌ కమ్ముల అగ్ర కథానాయకుడు చిరంజీవిని  తాజాగా కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్‌మీడియా వేదికగా ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమంటూ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. చిరంజీవి అంటే తనకెంత ఇష్టమో చెప్పారు. చిరంజీవిని తొలిసారి చూసిన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ''టీనేజీలో ఉన్నప్పుడు మెగాస్టార్‌ చిరంజీవిని ఒక్కసారి దగ్గర నుంచి చూశాను. 'ఈయనతో సినిమా చేయాలి' అనే భావన కలిగింది. అంతే, ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు అవుతోంది. దీనిని సెలబ్రేట్‌ చేసుకుందామని మా టీమ్‌ అనగానే నాకు మొదట గుర్తుకు వచ్చిన వ్యక్తి చిరంజీవి. కొన్ని తరాల వారిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. కలలను వెంటాడితే విజయం తప్పకుండా మనల్ని ఫాలో అవుతుందని నమ్మకం ఇచ్చిన వ్యక్తి ఆయనే. నా ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని ఆయన సమక్షంలో చేసుకోవాలనిపించింది.ఈ క్షణంలోనే కాదు.. నా టీనేజీ నుంచి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు'' అని శేఖర్‌ కమ్ముల రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణ కథలను సైతం ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా చెప్పడం శేఖర్‌ కమ్ముల స్టైల్‌. 'డాలర్‌ డ్రీమ్స్‌' అనే చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. 100 నిమిషాల నిడివితో రూపొందిన ఈసినిమా పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. 'ఆనంద్‌'తో తెలుగు వారికి చేరువయ్యారు. 'గోదావరి', 'హ్యాపీ డేస్‌', 'లీడర్‌', 'ఫిదా' వంటి చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 2021లో విడుదలైన 'లవ్‌ స్టోరీ' తర్వాత ఆయన రూపొందిస్తున్న చిత్రం 'కుబేర'. ధనుష్‌ హీరోగా ఈ సినిమా సిద్ధమవుతోంది. నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)