అఖిల్ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన నాగార్జున దంపతులు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన సినీనటుడు నాగార్జున దంపతులు తమ కుమారుడు అఖిల్ వివాహా వేడుకకు హాజరుకావాలని పెళ్లి పత్రికను అందించారు. నాగార్జున చిన్న కొడుకు అఖిల్,  జైనబ్‌ల పెళ్లి జూన్ 6న జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పనులు కూడా ప్రారంభమైనట్లు తెలుస్తోంది. వారి పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం లాగానే అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే జరగనుందని సమాచారం. కాగా, గత కొంత కాలంగా అఖిల్, జైనబ్ ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరు పెద్దల అనుమతితో గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)