అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్యా !

Telugu Lo Computer
0


త్తర ప్రదేశ్ లోని కాన్పూర్‌, లక్ష్మణ్‌ఖేద గ్రామానికి చెందిన ధర్మేంద్ర పాసి, రీనా భార్యా భర్తలు. రీనా అల్లుడి వరుసయ్యే సతీష్ అనే యువకుడితో సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ధర్మేంద్రకు తెలిసింది. రీనాతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలోనే ధర్మేంద్ర తమ బంధానికి అడ్డు అవుతాడని ఇద్దరూ భావించారు. చంపటానికి ప్లాన్ చేశారు. మే 10వ తేదీన ధర్మేంద్ర తినే ఆహారంలో రీనా నిద్ర మాత్రలు కలిపింది. అతడు తిని మత్తులోకి జారుకున్నాడు. డోరు ఫ్రేమ్‌తో రీనా అతడి తలపై బలంగా కొట్టి చంపేసింది. భర్తను చంపిన తర్వాత శవాన్ని ఇంటి బయటకు తీసుకొచ్చి పడేసింది. పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని మొత్తం పరిశీలించారు. శవం ఇంటి బయట ఉంది. రక్తం ఇంట్లో, వరండాలో, బాత్ రూమ్ దగ్గర కూడా ఉంది. ఇదే పోలీసులకు అనుమానం వచ్చేలా చేసింది. తన భర్తను ఓ ముగ్గురు వ్యక్తులు చంపేశారంటూ అదే గ్రామానికి చెందిన ముగ్గురి పేర్లు చెప్పింది. అయితే, పోలీసులకు మాత్రం ఆమె మీద అనుమానం పోలేదు. రీనా కాల్ డేటాను చెక్ చేశారు. ఆమె సతీష్‌తో గంటలు, గంటలు మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు ఇద్దరూ ఒకరికి ఒకరు అశ్లీల ఫొటోలు సైతం పంపుకున్నారు. ఆ విషయం కూడా బయటపడింది. ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. తమ అక్రమ సంబంధం గురించి భర్తకు తెలిసినందుకే చంపేసినట్లు రీనా తెలిపింది. పోలీసులు ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)