ఎయిర్‌టెల్‌ యూజర్లకు 100 జీబీ క్లౌడ్‌ స్టోరేజీ ఉచితం

Telugu Lo Computer
0


గూగుల్ వన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవల్ని యూజర్లకు ఉచితంగా అందించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. దీని కోసం గూగుల్‌తో జట్టుకట్టినట్లు వెల్లడించింది. పోస్ట్‌ పెయిడ్‌, వైఫై కస్టమర్లకు అదనపు స్టోరేజీ అందించాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. గూగుల్‌ వన్‌ సబ్‌స్క్రిప్షన్‌ కింద ఎయిర్‌టెల్ పోస్ట్‌ పెయిడ్‌, వైఫై కస్టమర్లు అదనపు ఖర్చు లేకుండా ఆరు నెలలకు 100 జీబీ గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ స్టోరేజ్‌ను అందించనుంది. అయితే ఈ స్టోరేజ్‌ను ఐదుగురు వ్యక్తులతో పంచుకొనే సదుపాయాన్ని టెలికాం అందిస్తోంది. అర్హులైన కస్టమర్లు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో లాగిన్‌ అయి ఈ ప్రయోజనాల్ని పొందొచ్చు. అయితే ఆరు నెలల తర్వాత స్టోరేజ్‌ కావాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిందే. నెలకు రూ.125 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్లౌడ్‌ స్టోరేజీ సదుపాయం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు వినియోగించుకోవచ్చు. గూగుల్‌తో కలిసి ఈ సేవల్ని తీసుకురావడం ఆనందంగా ఉందని ఎయిర్‌టెల్‌ సీఈఓ సిద్ధార్థ్‌ శర్మ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)