మావోయిస్ట్ అగ్ర నేత హిడ్మా అరెస్టు

Telugu Lo Computer
0


మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు మరణంతో తగిలిన షాక్ నుంచి పూర్తిగా తేరుకోక ముందే పార్టీ కీలక నేత హిడ్మాను ఒడిషాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దట్టమైన పెటగుడ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు నేడు అరెస్టు చేశాయి. హిడ్మా అరెస్ట్ సందర్భంగా ఏకే-47 రైఫిల్‌తో సహా పెద్ద మొత్తంలో మావోయిస్టుల సామాగ్రి, ఇతర కీలకమైన వస్తువులను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. హిడ్మా అరెస్ట్ ను భద్రత దళాలు ఇంకా ధృవీకరించలేదు. దక్షిణ బస్తర్ పరిధిలోని సుక్మా జిల్లా పువర్తి గ్రామానికి చెందిన హిడ్మా బస్తర్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టుల బెటాలియన్ 1కి కమాండర్‌గా ఉన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)