మూడో స్థానానికి పడిపోయిన ఓలా మార్కెట్ వాటా ?

Telugu Lo Computer
0


ద్విచక్ర మార్కెట్‌లో ఓలాదే అగ్రస్థానం. ఓలా క్రమంగా తన మార్కెట్ వాటాను కోల్పోతూ వస్తోంది. సర్వీసింగ్‌లో లోపాలు ఓలాకు పెద్ద దెబ్బగా మారాయి. ఆ లోపాన్ని సరిదిద్దుకునేందుకు ఓలా ఎంతగా ప్రయత్నిస్తున్నా వినియోగదారులు ఆ సంస్థపై నమ్మకం ఉంచడం లేదు. ప్రత్యర్థి కంపెనీలైన టీవీఎస్, బజాజ్ ఈవీల విక్రయాలు జోరందుకుంటున్నాయి. దీంతో ఓలా అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. పలు నియంత్రణ సంస్థల నుంచి ఓలాకు సమస్యలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ వాహన పోర్టల్ మరో షాకింగ్ విషయం వెల్లడించింది. ఈ ఏడాది మే నెలలో 1-26 తేదీల మధ్య 15, 221 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో 37, 388 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే గతేడాది ఓలా స్కూటర్ల అమ్మకాలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఓలా ఈవీ అమ్మకాల సంఖ్య ఏకంగా 60 శాతం తగ్గిపోయింది. గతేడాది ఈ సీజన్‌కు విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఓలా వాటా 50 శాతంగా ఉండేది. అది ప్రస్తుతం 20 శాతానికి పడిపోయింది. 2025 మే నెల నాటికి విద్యుత్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ మోటార్ 25 శాతం వాటాతో అగ్రగామిగా ఉంది. ఆ తర్వాత బజాజ్ ఆటో 22.6 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఓలా 20 శాతంతో, ఏథర్ ఎనర్జీ 13.1 శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)