'ఎమిరేట్స్ డ్రా మెగా 7' లాటరీలో రూ. 231 కోట్లు గెలుచుకున్న శ్రీరాం రాజగోపాలన్

Telugu Lo Computer
0


చెన్నైకు చెందిన 56 ఏళ్ల ఇంజినీర్‌ శ్రీరాం రాజగోపాలన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహించే అత్యంత ప్రఖ్యాతిగాంచిన 'ఎమిరేట్స్ డ్రా మెగా7' లాటరీలో 231 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు. మార్చి 16న తన పుట్టినరోజు సందర్భంగా శ్రీరాం సరదాగా ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. 'ఈ టికెట్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని నేను ఊహించలేదు. కేవలం సరదా కోణంలోనే దాన్ని తీసుకున్నా,' అని ఆయన అన్నారు. మెగా7 డ్రాలో పాల్గొనడానికి ఆయన యాధృచ్ఛికంగా ఏడు నెంబర్లను ఎంచుకున్నారు. ఇవే నెంబర్లు జాక్‌పాట్‌ను తెచ్చిపెట్టడంతో ఆయన ఆశ్చర్యంలో మునిగిపోయారు. 'ఫలితాలు చూసినప్పుడు మొదట నమ్మలేదు. డ్రా వీడియోను మళ్లీ, మళ్లీ చూశాను. స్క్రీన్‌షాట్‌లు తీసుకున్న తర్వాతే నిజమని నమ్మగలిగాను,' అని ఉల్లాసంతో చెప్పారు. ఇది పూర్తిగా అదృష్టం, దీనికి లాజిక్ అక్కర్లేదని పేర్కొన్నారు. ఈ భారీ విజయం తన జీవితాన్ని ఒక్కరోజులోనే మార్చేసిందని శ్రీరాం రాజగోపాలన్ తెలిపారు. 'ఇదంతా ఇంకా కలలా అనిపిస్తుంది. ఒక సాధారణ వ్యక్తిగా జీవిస్తున్న నా జీవితం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నా సమయం వచ్చింది,' అని ఆత్మవిశ్వాసంతో అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)