కేరళలోకి 24న ప్రవేశించనున్న నైరుతి ఋతుపవనాలు

Telugu Lo Computer
0


నెల 24న కేరళలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులంతా విస్తరించాయని, అనుకున్న సమయం కంటే ఐదు రోజుల ముందుగానే ఇవి అండమాన్‌ను చేరాయని తెలిపారు. తొలుత ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణకి కూడా వర్ష సూచన ఉందని చెప్పింది. అటు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందంది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)