ఆగస్టు 1న నుంచి యూపీ మార్పులు

Telugu Lo Computer
0


యూపీ సేవలపై భారం తగ్గించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కొత్త మార్గదర్శకాలు ఆగస్టు 1న నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు యూపీఐ యాప్‌లలో లావాదేవీల సామర్థ్యాన్ని పెంచడం, సాంకేతిక ఆటంకాలను తగ్గించడం కోసం రూపొందించబడ్డాయి. ఈ కొత్త నియమాలు యూపీఐ వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. యూపీఐ యాప్‌ల ద్వారా బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసే సౌకర్యంపై ఎన్‌పీసీఐ కొత్త పరిమితిని విధించింది. ఆగస్టు 1 నుంచి ఒక రోజులో గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయగలరు. ఈ నియమం యూపీఐ సర్వర్‌లపై అనవసర ఒత్తిడిని తగ్గించడానికి ఉద్దేశించబడింది. ఒక యూపీఐ యాప్‌కు లింక్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలను తనిఖీ చేసేందుకు కూడా కొత్త ఆంక్షలు అమలులోకి రానున్నాయి. రోజుకు గరిష్ఠంగా 25 సార్లు మాత్రమే లింక్ చేసిన ఖాతాలకు సంబంధించిన ఎంక్వైరీలు చేయవచ్చు. ఈ నియమం యూపీఐ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలను నివారించడానికి తోడ్పడుతుందని ఎన్‌పీసీఐ అభిప్రాయపడింది. ఆటో పే ద్వారా బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్ చేయడం కూడా కొత్త నియమాల కింద నియంత్రించబడుతుంది. బ్యాంకులు నాన్-పీక్ అవర్స్‌లో మాత్రమే ఆటో పే లావాదేవీలను ప్రాసెస్ చేయాలని ఎన్‌పీసీఐ ఆదేశించింది. ఇది సిస్టమ్ ఒత్తిడిని తగ్గించి, సాఫీగా లావాదేవీలు జరిగేలా చేస్తుంది. లావాదేవీ పూర్తయిన తర్వాత దాని స్టేటస్ తనిఖీ చేయడానికి యూజర్లు కనీసం 90 సెకన్లు వేచి ఉండాలని ఎన్‌పీసీఐ సూచించింది. ఈ నియమం ట్రాన్సాక్షన్ స్టేటస్ ఎపీఐ కాల్స్ అధిక ఫ్రీక్వెన్సీని నియంత్రించడానికి ఉద్దేశించబడింది, ఇది గతంలో యూపీఐ సిస్టమ్ ఆటంకాలకు కారణమైంది. గత కొంతకాలంగా యూపీఐ సేవల్లో అప్పుడప్పుడు సాంకేతిక ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ ఆటంకాలకు ప్రధాన కారణం అధిక సంఖ్యలో ఎపీఐ కాల్స్, ముఖ్యంగా బ్యాలెన్స్ ఎంక్వైరీ, ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ వంటి నాన్-ఫైనాన్షియల్ లావాదేవీలు. ఈ సమస్యలను అధిగమించడానికి ఎన్‌పీసీఐ ఈ కొత్త ఆంక్షలను ప్రవేశపెడుతోంది. ఈ నియమాలు సిస్టమ్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, వినియోగదారులకు సురక్షితమైన, నమ్మదగిన చెల్లింపు అనుభవాన్ని అందించడంలో సహాయపడతాయని ఎన్‌పీసీఐ భావిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)