జుపిటర్ 125 కొత్త వేరియంట్‌ను టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రారంభ ధరగా రూ. 80,740 (ఎక్స్-షోరూం) నిర్ణయించారు. ఐవరీ బ్రౌన్, ఐవరీ గ్రే అనే రెండు కొత్త డ్యూయల్ టోన్ రంగులలో ఇది లభించనుంది. అలాగే స్కూటర్‌లో డ్యూయల్ టోన్ ఇన్నర్ ప్యానల్స్, అదే షేడుతో ఉండే ఫ్లాట్ సింగిల్ పీస్ సీట్ కల్పించారు. ఇంకా 3D ఎంబ్లెమ్స్, బాడీ కలర్ గ్రాబ్ రైల్ వంటి డిజైన్ అప్‌డేట్స్ కూడా ఉన్నాయి. ఈ వేరియంట్‌కి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. ఇందులో TVS SmartXonnect కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. దీని ద్వారా వినియోగదారులు వాహన ట్రాకింగ్, వాయిస్ కమాండ్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, SMS అలర్ట్స్, కాల్ అలర్ట్స్ వంటి ఆధునిక ఫీచర్లను వినియోగించుకోవచ్చు. ఇతర వేరియంట్ల మాదిరిగానే ఈ DT SXC వేరియంట్‌కి కూడా అదే మెకానికల్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి. స్కూటర్‌లో ముందుభాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో 3-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ ట్యూబ్ షాక్ అబ్సార్బర్ ఉన్నాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో 220 mm డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. స్కూటర్ 12-అంగుళాల చక్రాలపై నడుస్తుంది. టీవీఎస్ జుపిటర్ 125 DT SXC వేరియంట్‌కి 124.8 cc సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉండి, ఇది 8hp శక్తి, 11 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి సీవీటీ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. ఈ స్కూటర్ మార్కెట్లో హోండా ఆక్టివా 125, సుజుకి యాక్సెస్ 125 వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలవనుంది.
టీవీఎస్ జుపిటర్ 125 కొత్త వేరియంట్ విడుదల
May 29, 2025
0
Tags