దేశంలో వెయ్యికిపై కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ నుంచి కర్ణాటక వరకు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా కేసులు ఇప్పుడు భయపెడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో మొత్తం 1009 యాక్టివ్ కోవిడ్ 19 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరంలో దేశంలో కరోనా కేసులు 1000 దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేరళలో అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ అత్యధికంగా 430 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, తమిళనాడులో 69, కర్ణాటకలో 47 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో 15, రాజస్థాన్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 12, పుదుచ్చేరిలో 9, హర్యానాలో 9, ఆంధ్రప్రదేశ్‌లో 4, మధ్యప్రదేశ్‌లో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, గోవాలో 1, తెలంగాణలో 1 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1009కి చేరుకుంది.
దేశంలో 1009 యాక్టివ్ కోవిడ్ 19 కేసులు నమోదు
May 26, 2025
0
Tags