ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చెంప చెళ్లుమనిపించిన భార్య బ్రిగిడా ?

Telugu Lo Computer
0


ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వియత్నాంలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా విమానంలోనుంచి కిందకు దిగుతుండగా మెక్రాన్ సతీమణి బ్రిగిటే ఆయన్ను చెంపపై కొడుతున్న దృశ్యాలు విమానం కింద ఆయనకు ఆహ్వానం పలికేందుకు వచ్చిన వారు చూశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. అయితే దీనిపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది. మెక్రాన్ పై ఆయన సతీమణి బ్రిగిటే కావాలని చేయిచేసుకోలేదని, అది టీజ్ చేసేందుకు అలా కొట్టిందని వివరణ ఇచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కు చెందిన అధికారిక విమానం ఆదివారం రాత్రి వియత్నాంలోని హనోయిలో ల్యాండ్ అయింది. కొద్ది క్షణాల తర్వాత డోర్లు ఓపెన్ అయ్యాయి. అయితే అప్పుడు ఓ దృశ్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెక్రాన్ ను ఆయన భార్య చెంపపై కొడుతున్నట్లు ఉంది. వెంటనే మెక్రాన్ తేరుకుని ఆమె చేతిని నెట్టివేశారు. ఆ తర్వాత మెక్రాన్ భార్య బ్రిగిటే విమానంలోనే ఉండిపోయింది. బయటకు రాలేదు. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఫ్రాన్స్ లో తీవ్ర స్పందన వస్తోంది. ఇది దేశానికే అవమానకరమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇది భార్యాభర్తల విషయం అని కొందరు చెబుతున్నారు. మెక్రాన్ తన భార్యతో క్లోజ్ గా మూవ్ అయ్యారని, ఆమె భర్తపై చేతులు వేసిందని సాక్షులు తెలిపారు. మరికొందరు మాత్రం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. మెక్రాన్ సౌత్ ఈస్ట్ ఏషియా టూర్ లో భాగంగా వియత్నాంలో పర్యటించారు. వియత్నాంతో పలు ఒప్పందాలు చేసుకుంది ఫ్రాన్స్ ప్రభుత్వం. వియత్నాం తర్వాత మెక్రాన్ ఇండోనేషియా, సింగపూర్ లోనూ పర్యటించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)