చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన 75వ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఎక్క్ వేదికగా చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నా స్నేహితుడు చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. భవిష్యత్ రంగాలపై దృష్టిసారించి ఆయన పని చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి అవిశ్రాంతంగా పని చేస్తున్న చంద్రబాబు పనితీరు ప్రశ్నంసనీయం. ఆయనకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా" అని మోడీ పేర్కొన్నారు. అలాగే, సీఎం చంద్రబాబుకు వైకాపా అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నట్టు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆయనకు అనేక సినీ రాజకీయ రంగ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెపుతున్నారు. చంద్రబాబుతో దిగిన ఓ అపరూప చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దూరదృష్ట కలిగిన నాయుకుడు దొరగడం తెలుగు ప్రజల అదృష్టమంటూ చంద్రబాబు సేవలను కొనియాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)