వైఎస్ విజయమ్మ నిశ్శబ్ద శక్తికి ప్రతీక : విజయసాయిరెడ్డి ట్వీట్

Telugu Lo Computer
0


వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను ఉద్దేశించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇవాళ వైఎస్ విజయమ్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు కుమారుడు జగన్, కుమార్తె వైఎస్ షర్మిలతో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు వరుసగా శుభాకాంక్షలు తెలిపారు. ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి కూడా విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేసారు. అయితే ఇందులో ఆయన వాడిన పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటికే కుటుంబ వివాదాలతో సతమతం అవుతున్న విజయమ్మను ఉద్దేశించి నిశ్శబ్ద శక్తికి ప్రతీక అంటూ సాయిరెడ్డి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ సాయిరెడ్డి తన ట్వీట్ లో శ్రీమతి వై.ఎస్.విజయమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. దయ, ధైర్యం మరియు నిశ్శబ్ద శక్తికి ప్రతీక. త్యాగం, గౌరవం, విలువల పట్ల అచంచల నిబద్ధతతో కూడిన మీ జీవితం లెక్కలేనన్ని హృదయాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సాయిరెడ్డి తెలిపారు. మీకు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆరోగ్యం, శాంతి, దైవిక కృప లభించుగాక అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ ముగించారు. దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)