బెల్జియం కారు రేసింగ్‌లో డివైడర్‌ను ఢీ కొట్టిన అజిత్‌ కారు !

Telugu Lo Computer
0


బెల్జియం కారు రేసింగ్‌లో అజిత్‌ నడుపుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జవగా అజిత్‌ సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కారు రేసింగ్‌లో అజిత్‌ పలుమార్లు ప్రమాదానికి గురయ్యాడు. ఇటీవల మార్చిలో స్పెయిన్‌లో జరిగిన రేసింగ్‌లో కారు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ రేసింగ్‌లో.. మరో కారును తప్పించే క్రమంలో అజిత్‌ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆయన కారు ట్రాక్‌ తప్పి పల్టీలు కొట్టింది. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్‌ అవడంతో అజిత్‌ సురక్షితంగా బయటకు వచ్చాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)