23న ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు ఈనెల 23వ తేదీన విడుదల కానున్నాయి. ఇప్పటికే వాల్యుయేషన్ కూడా పూర్తయింది. ఆన్‌లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు. పదో తరగతి పరీక్షలకు 6 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 5 లక్షలకు పైగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు రాయగా, 51 వేల మందికి పైగా తెలుగు మీడియం పరీక్షలు రాశారు. మార్చి 17 నుంచి మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు.ఇక వ్యాల్యూయేషన్‌ కూడా పూర్తవడంతో ఆన్‌లైన్ ఎంట్రీ చేస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ అయిన bie.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా వాట్సాప్ వెసులుబాటు కూడా కల్పించింది. ఏపీ ప్రభుత్వం ఈ నేపథ్యంలో 955230090 నెంబర్‌కు 'Hi' అని పంపించి మీ పదో తరగతి పరీక్ష ఫలితాలు కూడా తెలుసుకోవచ్చు. మీసర్వీస్‌పై క్లిక్ చేసి పదో తరగతి ఫలితాలు పొందవచ్చు. మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)