రెండు వేల మంది అదే పోస్ట్‌ను షేర్‌ చేశారు, వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా? : స్మితా సబర్వాల్‌

Telugu Lo Computer
0


తెలంగాణ ఐఏఎస్‌ అధికారిణి స్మితా సబర్మాల్‌ శనివారం గచ్చిబౌలి పోలీసుల ఎదుట విచారణకు హాజరై స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించిన ఆమె సోషల్‌ మీడియాలో చేసిన ఓ పోస్టుకుగానూ నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. ఆమె విచారణకు హాజరై స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తరువాత తన ఎక్స్‌ ఖాతాలో ''చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చా. పోలీసులకు పూర్తిగా సహకరించా. నేను ఎలాంటి పోస్ట్‌ చేయలేదు. హాయ్‌ హైదరాబాద్‌ పోస్టును రీట్వీట్‌ చేశా. 2 వేల మంది అదే పోస్ట్‌ను షేర్‌ చేశారు. వాళ్లందరితోనూ ఇలాగే వ్యవహరిస్తారా? ఇలాగే నోటీసులు ఇచ్చి వారందరిపై ఇలాగే చర్యలు తీసుకుంటారా?. అలా చేయకపోతే కొంతమందినే టార్గెట్‌ చేసినట్లు అవుతుంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుంది. ఇది ఎంత వరకు కరెక్ట్‌?. జస్టిస్‌ అనేది అందరికీ సమానంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమా? ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా?'' అని రాసుకొచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)