జామ్‌నగర్‌ నుంచి ద్వారకకు అనంత్‌ అంబానీ పాదయాత్ర

Telugu Lo Computer
0


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ చిన్నకుమారుడైన అనంత్‌ అంబానీ (29) గుజరాత్‌లోని తమ పూర్వీకుల స్వస్థలం జామ్‌నగర్‌ నుంచి శ్రీకృష్ణుడు వెలసిన దివ్యక్షేత్రమైన ద్వారకకు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. 170 కిలోమీటర్ల ఈ పాదయాత్రను మార్చి 29న ప్రారంభించిన అనంత్‌ రోజుకు 20 కి.మీ.ల చొప్పున నడుస్తున్నారు. నిత్యం రాత్రివేళ ఏడు గంటల చొప్పున నడుస్తూ మార్గమధ్యంలో ఎదురయ్యే ప్రజలతో మమేకం అవుతున్నారు. తన 30వ పుట్టిన రోజుకు రెండు రోజులు ముందుగా ఏప్రిల్‌ 8న ఆయన ద్వారకకు చేరుకుంటారు. ఈ యాత్రలో కొందరు స్థానికులు సైతం అనంత్‌కు సంఘీభావంగా వెంట నడుస్తున్నారు. మరికొందరు ఆయనకు ఎదురుగా వచ్చి ఫొటోలు తీసుకొంటున్నారు. హనుమాన్‌ చాలీసా, సుందరకాండ, దేవీ స్తోత్రాలను వల్లె వేస్తూ ఈ ఆధ్యాత్మిక పాదయాత్రలో అనంత్‌ ముందుకు సాగుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)