నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కుమార్తె బర్త్ డే నేపథ్యంలో తన కుటుంబం రాజస్థాన్ వెళ్లిందని, ఆ సమయంలో తన ఇల్లు ధ్వంసం చేశారని తన ఫిర్యాదులో మంచు మనోజ్ పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కారుతోపాటు వస్తువులను సైతం దొంగిలించాడని తెలిపారు. జల్‌పల్లిలోని ఇంటిలో సైతం 150 మంది చొరబడి విధ్వంసం సృష్టించారరని ఆ ఫిర్యాదులో స్పష్టం చేశారు. తన ఇంటిలోని విలువైన వస్తువులతోపాటు కార్లను కూడా ఎత్తుకొని వెళ్లారని మంచు మనోజ్ స్పష్టం చేశారు. అయితే తన ఇంటి నుంచి చోరీ అయిన కార్లు విష్ణు కార్యాలయంలో లభ్యమైనాయని పేర్కొన్నారు. తన ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారని, ముఖ్యమైన వస్తువులన్నింటిని పగల కొట్టి విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లో జరుగుతోన్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించానన్నారు. కానీ తన తండ్రి అందుబాటులోకి రాలేదన్నారు. ఈ కేసులో తనకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశానని మంచు మనోజ్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)