రాప్తాడులో డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్ డ్యామేజ్ అయింది. రాప్తాడు పర్యటనలో భాగంగా జగన్ ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడకు చేరుకున్నారు. తిరిగి అదే హెలికాప్టర్ లో జగన్ బెంగళూరు వెళ్లాల్సి ఉంది. అయితే, భారీగా అభిమానులు తరలి వచ్చారు. జగన్ పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య పరామర్శ పూర్తి చేసుకొని వచ్చే సమయానికి హెలికాప్టర్ డామేజ్ కావటంతో పైలెట్లు అందులో ప్రయాణానికి తిరస్కరించారు. రోడ్డు మార్గంలో జగన్ బెంగళూరు వెళ్లారు. కాగా, జగన్ పర్యటన సమయంలో భద్రతా లోపం కారణంగానే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో గుంటూరు పర్యటన సమయంలో నూ ఇదే విధంగా భద్రత లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)