థాయ్‌ల్యాండ్‌లో చియాంగ్ మయి అనే నగరంలో చియాంగ్ మయి బ్రేక్‌ఫాస్ట్ వరల్డ్ అనే రెస్టారెంట్ వారు తమ హోటల్‌కు వచ్చే కస్టమర్స్ కోసం రెస్టారెంట్ ఎంట్రన్స్‌లో ఒక గ్రిల్ లాంటి గేట్ ఏర్పాటు చేశారు. కనీసం 5 శాతం నుండి 10%, 15%, 20% వరకు నాలుగు రకాల ఎంట్రీలు ఏర్పాటు చేశారు. ఎంట్రీపై చూపించినట్లుగా 5 శాతం డిస్కౌంట్ ఉన్న ఎంట్రీలోంచి వెళ్లే వారికి అంతమేర డిస్కౌంట్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా సన్నగా ఉన్న వారు 20 శాతం డిస్కౌంట్ ఎంట్రీ లోంచి లోపలికి వెళ్లగలిగితే అంత మొత్తం డిస్కౌంట్ ఇస్తారు. కానీ అందులోంచి వెళ్లాలంటే ఎంతో సన్నగా ఉన్న వారికి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యపడదు. 5% డిస్కౌంట్ ఆఫర్ ఉన్న ఎంట్రీలోంచి కూడా వెళ్లలేని వారు ఆ పక్కనే ఉన్న మరో పెద్ద ఎంట్రీలోంచి వెళ్లాల్సి ఉంటుంది. అది విశాలంగా ఉంటుంది. కానీ ఎలాంటి డిస్కౌంట్ ఉండదు. ఆ రెస్టారెంట్ యాజమాన్యం చేసిన ఈ వెరైటీ ప్రయోగం విమర్శలకు కారణమైంది. లావుగా ఉన్న కస్టమర్స్‌ను బాడీ షేమింగ్ చేయడం కోసమే ఈ తరహా ఆఫర్స్ పెట్టారని నెటిజెన్స్ మండిపడుతున్నారు.
కస్టమర్ సైజును బట్టి డిస్కౌంట్ ఆఫర్ !
April 08, 2025
0
Tags