వక్ఫ్ బిల్లుకు జనసేన మద్దతు !

Telugu Lo Computer
0


పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లుకు జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్ సభలో చర్చానంతరం వక్ఫ్ బిల్లుకు మద్దతుగా జనసేన పార్టీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొంటారని ప్రకటనలో పేర్కొంది. కేంద్రం వక్ఫ్ బిల్లుకు ప్రతిపాదించిన సవరణలు ముస్లిం సామాజికవర్గానికి మంచి చేస్తాయని పవన్ తెలిపారు. అయితే ఈ బిల్లుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా కూటమి పార్టీలు వక్ఫ్ బిల్లును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అంతే కాకుండా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు వక్ఫ్ బిల్లుకు కేంద్రం సవరించిన ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. ఎస్పీ, ఆర్జీడీ, ఎంఐఎం పార్టీలు కూడా వక్ఫ్ బిల్లును ఉభయసభల్లో అడ్డుకుంటామని పేర్కొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)