మిస్టరీ వీడిన ముగ్గురు పిల్లల మృతి కేసు : తల్లే హంతకురాలు

Telugu Lo Computer
0

హైదరాబాద్ శివారు లోని అమీన్‌పూర్‌ పిల్లల మృతి కేసును పోలీసులు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విషం పెట్టి పాశవికంగా అంతమొందించినట్లు తేల్చారు. వివాహేతర సంబంధం మోజులో ముగ్గురు పిల్లలను హత్య చేసిందని నిర్ధారించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని, తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో నిజం బయటపడటంతో తల్లి రజితను పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను కూడా చంపాలని ఆమె ప్రయత్నించిందని, అయితే  పెరుగన్నం తినకపోవడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అమీన్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన చాలా సంచలనం సృష్టించింది. ముందు భర్తను పోలీసులు అనుమానించారు. లోతైన దర్యాప్తు తర్వాత భార్య రజిత బాగోతం బయటపడింది. కొన్నాళ్ల క్రితం రజిత టెన్త్‌ క్లాస్‌మేట్స్‌ గెట్‌ టుగెదర్‌కు వెళ్లింది. అక్కడ ఓ స్నేహితుడితో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ సంబంధానికి పిల్లలు అడ్డొస్తున్నారనే కారణంతో వాళ్లను చంపాలని ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 27 రాత్రి పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి తినిపించింది. భర్త చెన్నయ్య ఆరోజు పెరుగు తినకుండా భోజనం ముగించాడు. తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవింగ్ పనిపై బయటకు వెళ్లిపోయాడు. తిరిగొచ్చాక చూస్తే పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు.  ఎందుకిలా జరిగిందో తనకు తెలియదని, తాను కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యానని రజిత చెప్పడంతో ఆమెను భర్త ఆస్పత్రిలో చేర్పించాడు. చివరికి విచారణలో ప్రియుడితో కలిసి రజిత చేసిన ఘోరం బయటపడింది. రజితతోపాటు ఆమె, ప్రియుడూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)