దంతేవాడలో 26 మంది నక్సలైట్లు లొంగుబాటు !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో 26 మంది మావోయిస్టులు సోమవారంనాడు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రివార్డులు ప్రకటించిన పలువురు మావోయిస్టులు కూడా ఉన్నారు. కొద్ది నెలలుగా భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య పలు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. అయితే క్రమంగా నక్సల్స్‌లో మార్పు కనిపిస్తోంది. లొంగిపోవడానికి ఐచ్ఛికంగా ముందుకు వస్తున్నారు. తాజాగా 26 మంది నక్సలైట్లు లొంగిపోవడంపై దంతేవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ, పోలీస్ సీనియర్ అధికారులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు వీరంతా లొంగిపోయినట్టు చెప్పారు. అడవుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అంతర్గత విభేదాలు, మావోయిస్టు సిద్ధాంతాలపై భ్రమలు తొలగిపోవడం వంటివి ఇందుకు కారణాలుగా వారు చెప్పినట్టు తెలిపారు. లొంగిపోయిన వారంతా జన్మిలీషియా, రివల్యూషనరీ పార్టీ కమిటీ (ఆర్‌సీసీ), మావోయిస్ట్ జనతన సర్కార్ విభాగాలు, దండకారణ్య ఆదివాసి కిసాన్ మజ్దూర్ సంఘటన్ (డీఏకేఎంఎస్), చేతనా నాట్యమండలి (సీఎన్ఎం)కి చెందిన వారని వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులలో రాజేష్ కశ్యప్‌పై రూ.3 లక్షలు, కోసా మాద్విపై రూ.1, ఛోటు కుంజంపై రూ.50 వేలు రివార్డు ఉందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)