ఏటీఎంల్లో ఎప్పటికప్పుడు రూ.100, రూ.200 నోట్లు అందుబాటులో ఉండేలా చూడాలని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. తద్వారా ప్రజలకు ఈ తరహా నోట్ల లభ్యతను పెంచాలని తెలిపింది. బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు దశలవారీగా ఈ ఆదేశాలను అమలు చేయాల్సి ఉంది. 'ప్రజలు ఎక్కువగా వాడే నోట్ల లభ్యతను పెంచే ఉద్దేశంతో బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు వాటి ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు అందుబాటు ఉండేలా చూడాలని ఆదేశించినట్లు' ఆర్‌బీఐ తెలియజేసింది.
ఏటీఎంల్లో రూ.100, రూ.200 నోట్ల లభ్యత పెంచండి : ఆర్‌బీఐ
April 29, 2025
0
Tags