వాట్సప్‌ వెబ్‌ నుంచి నేరుగా కాల్స్‌ ఫీచర్‌ ?

Telugu Lo Computer
0


వాట్సప్‌ వెబ్‌ వినియోగదారులకు యాప్‌తో పని లేకుండా వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసే ఫీచర్‌ను వాట్సప్‌ అందుబాటులోకి తేనుంది. వాట్సప్‌ మొబైల్‌ యాప్‌, డెస్క్‌టాప్‌ వెర్షన్లకు చాలా కాలం నుంచే కాలింగ్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. అయితే వాట్సప్‌ వెబ్‌ యూజర్లు ఈ సదుపాయం వినియోగించాలంటే యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం తప్పనిసరి. ఇకపై ఆ సమస్య ఉండదు. యాప్‌తో పని లేకుండా నేరుగా కాల్స్‌ చేయొచ్చన్నమాట. అంటే త్వరలో వాట్సప్‌ వెబ్‌ చాట్స్‌లోనూ ఫోన్‌, వీడియో కాల్‌ ఐకాన్‌లు కనిపించనున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఇంకా పరీక్ష దశలోనే ఉందని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే 'వాబీటా ఇన్ఫో' తన బ్లాగ్‌లో పంచుకుంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తేనుందని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)