రేషన్ కార్డుల e-KYC గడువు ఏప్రిల్ 30 వరకు పొడిగింపు

Telugu Lo Computer
0


జాతీయ ఆహార భద్రతా చట్టం లబ్ధిదారులకు e-KYC ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 2025 ఏప్రిల్ 30 వరకూ e-KYC ప్రక్రియ గడువు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రతా చట్టం క్రింద పంపిణీ అవుతున్న నిత్యావసర సరుకుల సబ్సిడీలలో పారదర్శకత, సబ్సిడీ సజావుగా కేటాయింపు కొరకు e-KYC ప్రక్రియ తప్పనిసరి. లబ్ధిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని గడువు తేదీ లోగా e-KYC ప్రక్రియను పూర్తిచేయవచ్చని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)