తెలంగాణలో టెన్త్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

Telugu Lo Computer
0


తెలంగాణలో మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని గురువారం ఆదేశాలిచ్చింది. ఇది సర్కారు బడుల్లో సెంటర్లు ఉన్న చోటనే వర్తిస్తుంది. ఈ సెంటర్లలో ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్న తేడాల్లేకుండా పరీక్ష పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించింది. అయితే పరీక్షలకు ముందే ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం వరకు నాలుగు పరీక్షలు అయిపోయాయి. మరో మూడు పరీక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని మైనర్‌ సబ్జెక్టులకు సైతం పరీక్షలు జరుగుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)