జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా సూత్రం, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత ప్రముఖ నటుడు విజయ్ తప్పుపట్టింది. ఈరోజు తిరువన్మయూర్ లో తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వక్ఫ్ సవరణ బిల్లుతో సహా మొత్తం 17 తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు విజయ్ పాల్గొన్నారు. సమావేశంలో వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరాలని పార్టీ నిర్ణయించింది. తాము ద్విభాషా విధానానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. విద్యావిధానంలో మూడు భాషల విధానం అమలు ప్రతిపాదన ఫెడరలిజానికి విరుద్ధమని, దీన్ని ఎప్పటికీ తాము అంగీకరించమని స్పష్టం చేసింది. డీలిమిటేషన్ కారణంగా దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని తీర్మానంలో పేర్కొంది.
త్రిభాషా విధానం సమాఖ్యకు విరుద్ధం !
March 28, 2025
0
Tags