జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి ఆయన గతంలోనే రాజీనామా చేశారు. జనసేనలో చేరతానని అప్పుడే ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను తాజాగా కలిశారు. జనసేనలో చేరే అంశంపై చర్చించారు. కాగా 2014లో పెండెం దొరబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అయితే 2019లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఐదేళ్ల పాటు వరకూ ప్రజలకు సేవలు అందించారు. అయితే అనూహ్యంగా 2024లో వైసీపీ నుంచి ఆయనకు సీటు దక్కలేదు. మహిళా నేత, అప్పటి ఎంపీ వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)