పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్‌సభలో ప్రధాని ప్రసంగిస్తూ మహాకుంభమేళా విజయం అందరూ కలసికట్టుగా చేసిన కృషికి నిదర్శనమని ప్రధాని మోడీ అన్నారు. ఈసందర్భంగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. ఈ విజయంపై దేశ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ''ఎర్రకోట నుండి సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ప్రాముఖ్యతను నేను ప్రధానంగా ప్రస్తావించాను. గతేడాది శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశం మొత్తం ఎలా పులకించిపోయిందో చూశాం. కుంభమేళాలోను అలాంటి ఐక్యతే కనిపించింది. ప్రపంచం మొత్తం భారతదేశ శక్తిసామర్థ్యాలను ఈ రూపంలో చూసింది. మన బలాన్ని అవమానించే వారికి ఈ కార్యక్రమం తగిన సమాధానం ఇచ్చింది. ఇక భారత సంప్రదాయాలను కొత్తతరం గౌరవంతో స్వీకరిస్తోంది'' అని మోడీ అన్నారు. ఈ ప్రసంగంపై ప్రశ్నలు వేయడానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. దాంతో సభ వాయిదా పడింది.
మహా కుంభమేళా విజయం అందరూ కలిసికట్టుగా చేసిన కృషికి నిదర్శనం !
March 18, 2025
0
Tags